ఇండియాలో “రాయన్” పై “డెడ్ పూల్ & వుల్వరిన్” డామినేషన్

ఇండియాలో “రాయన్” పై “డెడ్ పూల్ & వుల్వరిన్” డామినేషన్

Published on Jul 27, 2024 9:00 AM IST

ఈ ఫ్రైడే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరకి రిలీజ్ కి వచ్చిన పలు ప్రముఖ చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మాస్ డ్రామా “రాయన్” అలాగే హాలీవుడ్ అవైటెడ్ సినిమా “డెడ్ పూల్ & వుల్వరిన్” సినిమా కూడా ఒకటి. అయితే ఈ రెండు సినిమాలలో రాయన్ కి తమిళ్ లో ఎక్కువ బజ్ తెలుగులో నార్మల్ గానే రిలీజ్ కి వచ్చింది. అలాగే మార్వెల్ సినిమా “డెడ్ పూల్ & వుల్వరిన్” మంచి క్రేజ్ లో ఇండియన్ సినిమా దగ్గర విడుదలకి వచ్చింది.

అయితే ఎంతైనా డబ్బింగ్ సినిమా డబ్బింగ్ సినిమానే.. కానీ ఇంట్రెస్టింగ్ గా ఇండియన్ ఆడియెన్స్ ఆ డబ్బింగ్ సినిమాకే మొదటిరోజు భారీ బుకింగ్స్ ని అందించారు. డే 1 ఇండియాలో బుక్ మై షో బుకింగ్స్ చూస్తే ధనుష్ సినిమాకి 2 లక్షల 73 వేలకి పైగా బుకింగ్స్ నమోదు అయితే “డెడ్ పూల్ & వుల్వరిన్” కి మాత్రం 3 లక్షల 25 వేలకి పైగా బుకింగ్స్ నమోదు అయ్యాయి. దీనితో ఇండియాలో ఈ హాలీవుడ్ సినిమా డామినేషన్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో రేయాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్ మాన్ లు హీరోలుగా నటించగా షాన్ లెవీ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు