ఇండియ‌న్ బాక్సాఫీస్ దగ్గ‌ర ‘డెడ్ పూల్ & వాల్వ‌రైన్’ సాలిడ్ స్టార్ట్

ఇండియ‌న్ బాక్సాఫీస్ దగ్గ‌ర ‘డెడ్ పూల్ & వాల్వ‌రైన్’ సాలిడ్ స్టార్ట్

Published on Jul 27, 2024 5:30 PM IST

హాలీవుడ్ లో సూప‌ర్ హీరోల చిత్రాల‌కు ఎంత‌టి క్రేజ్ ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా మార్వెల్ స్టూడియోస్ నుంచి వ‌చ్చే సూప‌ర్ హీరో సినిమాల క్రేజ్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పాలి. ఇక ఈ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన తాజా సూప‌ర్ హీరో మూవీ ”డెడ్ పూల్ & వాల్వ‌రైన్” ప్రపంచ‌వ్యాప్తంగా నిన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ఇండియాలోనూ అదిరిపోయే క్రేజ్ నెల‌కొంది.

దీంతో ఈ సినిమాను తొలిరోజే చూసేందుకు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు. ఈ సినిమాలోని యాక్ష‌న్ సీన్స్ ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమాకు ఇండియా వైడ్ గా మంచి ఓపెనింగ్స్ ద‌క్కిన‌ట్లు సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. తొలిరోజే దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ.25 కోట్ల మేర గ్రాస్ వ‌సూళ్లు సాధించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ వ‌స్తుండ‌టం.. ఆగ‌స్టు 15 వ‌ర‌కు ఎలాంటి బ‌డా సినిమాలు లేక‌పోవ‌డంతో వ‌సూళ్లు మ‌రింత పెరుగుతాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర టోటల్ రన్ లో రూ.150-200 కోట్ల మేర వ‌సూళ్లు రాబ‌ట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అని సినీ ఎక్స్ ప‌ర్ట్స్ అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు