విడుదల తేదీ : ఏప్రిల్ 11, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ తదితరులు
దర్శకుడు: ఆనంద్ రవిచంద్రన్
నిర్మాత: వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్
సంగీత దర్శకుడు: జి వి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: జగదీష్ సుందరమూర్తి
ఎడిటింగ్: రుకేష్
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన పలు చిన్న చిత్రాల్లో కోలీవుడ్ నుంచి తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అయ్యిన “డియర్” కూడా ఒకటి. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే హీరో జివి ప్రకాష్ హీరోగా టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
అర్జున్ (జీవీ ప్రకాష్ కుమార్) న్యూస్ రీడర్. అయితే తను లైట్ స్లీపర్. అంటే.. చిన్న శబ్దం వినిపడినా నిద్ర లేస్తాడు. మరోవైపు దీపిక (ఐశ్వర్యా రాజేష్) నిద్రపోతే భయంకరంగా గురక పెడుతోంది. కొన్ని కారణాల వల్ల ఆమె సమస్యకు పరిష్కారం లేదు. ఇలాంటి పరిస్థతుల్లో దీపిక – అర్జున్ కి పెళ్లి జరుగుతుంది. దీంతో, అర్జున్ జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ?, అర్జున్ ఉద్యోగంతో పాటు పరువు ఎందుకు పోతుంది ?, అసలు దీపికాకు విడాకులు ఇవ్వాలని అర్జున్ ఏ కారణంగా నిర్ణయించుకుంటాడు ?, చివరకు అర్జున్ – దీపిక జీవితంలో ఏం జరిగింది ?, ఫైనల్ గా అర్జున్, దీపిక మళ్లీ ఒక్కటి అయ్యారా? లేదా? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన జీవీ ప్రకాష్ కుమార్ పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన లైట్ స్లీపర్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన ఐశ్వర్యా రాజేష్ పాత్ర, ఆమెకున్న గురక సమస్య.. మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ టోన్ తో సాగే ఎమోషనల్ సీన్స్ అండ్ మిగిలిన లవ్ సీక్వెన్స్ లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన జీవీ ప్రకాష్ కుమార్ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించింది. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచింది.
అలాగే, మరో కీలక పాత్రలో నటించిన రోహిణి కూడా చాలా బాగా నటించింది. ఇక కాళి వెంకట్ నటన కూడా చాలా బాగుంది. అలాగే వదిన పాత్రలో నటించిన నందిని కూడా మెప్పించింది. ముఖ్యంగా ఆమె హావ భావాలు బాగా అలరించాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగా తీశాడు.
మైనస్ పాయింట్స్ :
ఈ ‘డియర్’ స్క్రీన్ ప్లే బాగా స్లో గా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. కొన్ని సన్నివేశాలు సింపుల్ అండ్ స్లోగా సాగడం, అలాగే కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో జీవీ ప్రకాష్ కుమార్ క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.
అయితే దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు ఇంట్రెస్ట్ గా సాగకపోవడం, ఉన్న సీన్స్ కూడా రెగ్యులర్ గా సాగడం కూడా బాగాలేదు. ఇక కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. ఆనంద్ రవిచంద్రన్ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు.
సాంకేతిక విభాగం :
సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ జగదీష్ సుందరమూర్తి వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఈ చిత్ర నిర్మాతలు వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
‘డియర్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ అండ్ లవ్ సీన్స్ ఆకట్టుకున్నాయి. అయితే, కథ కథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team