ఆడియన్స్ ప్రస్తుతం డిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్ చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. కొత్త పాయింట్‌ను ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అలాంటి ఓ కొత్త పాయింట్‌తో ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ‘డియర్ ఉమ’ చిత్రం తెరకెక్కింది. తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా చేసిన ఈ చిత్రం ప్రస్తుతం ఆడియెన్స్ ముందుకు రానుంది. సుమయ రెడ్డి ఈ మూవీని సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఇందులో సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించారు. ఈ మూవీకి నిర్మాతగా సుమయ రెడ్డి.. లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు తాజాగా ప్రకటించారు.
ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు చక్కని సందేశాన్ని ఇవ్వబోతోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతోన్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఇక ఏప్రిల్ 18న ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ తదితరులు నటించారు.