రెండో ఫిల్మ్ సైన్ చేసిన మెగా హీరో..!

Published on Jul 1, 2020 1:02 am IST


మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్…మొదటి చిత్రం ఉప్పెన. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్న ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదావేసుకుంది. సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీ అందించిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా సినిమాపై మంచి అంచనాలున్నాయి. థియేటర్స్ తెరుచుకోవడం మరింత ఆలస్యం అయ్యే పక్షంలో ఓ టి టి లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా ఈ యంగ్ హీరో మరో మూవీకి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ మూవీ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఓ డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ చిత్ర పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

సంబంధిత సమాచారం :

More