DC IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బలాలు, బలహీనతలు మరియు గెలుపు అవకాశాలు

DC IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బలాలు, బలహీనతలు మరియు గెలుపు అవకాశాలు

Published on Mar 18, 2025 7:24 PM IST

Delhi-Capitals-ipl-2025-team

ఎప్పటిలానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కూడా మంచి రసవత్తరంగా మొదలు కాబోతుంది. ఇపుడు ఉన్న అన్ని జట్ల లానే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈసారి ఎలాగైనా కప్ కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. గత ఏడాది నవంబర్ 24-25,న జెడ్డాలో జరిగిన మెగా వేలంలో రీవాంప్ చేసిన జట్టుతో అడుగుపెడుతోంది. దీర్ఘకాల స్టార్ రిషభ్ పంత్‌తో విడిపోయిన తర్వాత, యంగ్ ప్లేయర్స్ సహా మంచి ఎక్స్ పీరియన్స్ ఉన్న ఆటగాళ్లపై యాజమాన్యం ఎక్కువ కేర్ తీసుకున్నారు. హెమంగ్ బడానీ హెడ్ కోచ్‌గా, మునాఫ్ పటేల్ బౌలింగ్ కోచ్‌గా, మెంటార్ కెవిన్ పీటర్సన్ సహకారంతో, ఈ ఫ్రాంచైజీ తన టైటిల్ కరువును ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ జట్టు, బలాలు, బలహీనతలు ఏంటి? వీరికి గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు:

టాప్-ఆర్డర్:

KL రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేసర్-మెక్‌గుర్క్ లాంటి ఆటగాళ్లతో DC ప్రారంభ ఓవర్లలో పటిష్ఠమైన స్కోర్ నమోదు చేసే అవకాశముంది.

అనుభవజ్ఞుడైన బౌలింగ్ దళం:

మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్ లాంటి బౌలర్లు జట్టులో ఉండటంతో DCకి బలమైన బౌలింగ్ అటాక్ ఉంది. స్పిన్ మరియు పేస్ మిశ్రమంతో ఏ మైదానమైనా సర్దుబాటు అవ్వగలరు.

ఆల్-రౌండర్స్:

కెప్టెన్ అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ లాంటి ఆల్-రౌండర్లు బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ కీలకంగా వ్యవహరించగలరు.

Also Read – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బలాలు, లోపాలు ఏంటి?

బలహీనతలు

అధ్వాన్నమైన మిడిల్-ఆర్డర్:

టాప్-ఆర్డర్ కూలిపోయినపుడు, ఢిల్లీ క్యాపిటల్స్ కి సరైన మిడిల్-ఆర్డర్ బ్యాటింగ్ కనిపించడం లేదు. ఒకవేళ ఓపెనర్లు అవుట్ అయితే నెక్స్ట్ కొంచెం కష్టమే.

ఓవర్సీస్ ప్లేయర్ల ఎంపిక సమస్య:

DCలో అనేక మంది టాప్-క్లాస్ విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కానీ ఒక్క మ్యాచ్‌లో 4 మాత్రమే ఆడే అవకాశం ఉండటంతో ప్లేయర్ల ఎంపికలో తర్జనభర్జన తప్పదు.

ఫినిషింగ్ లోపం:

మంచి ఫినిషింగ్ హిట్టర్లు లేకపోవడం వల్ల మ్యాచ్ చివరిలో మంచి స్కోర్ చేయడం కష్టమవుతుంది.

గెలుపు అవకాశాలు ఏ మేరకు:

DC ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బలమైన బౌలింగ్ యూనిట్ జట్టుకు గణనీయమైన ప్రాధాన్యత ఇస్తుంది. మంచి టాప్-ఆర్డర్ స్కోర్ ను నిలబెట్టగలిగితే, DC విజయవంతంగా నిలుస్తుంది. అయితే, మిడిల్-ఆర్డర్ సమస్యలను పరిష్కరించకపోతే, టైటిల్ గెలుచుకోవడం కష్టతరం అవుతుంది.

కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వ నైపుణ్యం మరియు కోచ్ హెమంగ్ బదానీ స్ట్రాటజీ చాలా కీలకం.

Also Read – ముంబై ఇండియన్స్ స్క్వాడ్.. బలాలు బలహీనతలు ఏంటి?

ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి మ్యాచ్ లో దాదాపు కనిపించే ప్లేయర్స్:

KL రాహుల్ (వికెట్-కీపర్)
జేక్ ఫ్రేసర్-మెక్‌గుర్క్
ఫాఫ్ డుప్లెసిస్
అభిషేక్ పోరెల్
అక్షర్ పటేల్ (కెప్టెన్)
ట్రిస్టన్ స్టబ్స్
అశుతోష్ శర్మ
మిచెల్ స్టార్క్
కుల్దీప్ యాదవ్
ముకేష్ కుమార్
T నటరాజన్

ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025 కోసం అపార సామర్థ్యంతో జట్టును సమీకరించింది. బ్యాటింగ్ ఫైర్‌పవర్ మరియు బౌలింగ్ వైవిధ్యంలో వారి బలాలు వారిని పోటీదారులుగా నిలబెడతాయి, కానీ స్పిన్ లోతు మరియు మిడిల్ ఆర్డర్ విశ్వసనీయతను పరిష్కరించడం వారి తొలి టైటిల్‌ను గెలవడానికి కీలకంగా కనిపిస్తున్న అంశాలు.

Also Read – చెన్నై సూపర్ కింగ్స్ (CSK).. బలాలు బలహీనతలు ఏంటి?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు