మన టాలీవుడ్ సినిమా దగ్గర నార్మల్ సహాయక పాత్రలో చిన్న చిన్న పాత్రలకి తెలుగు హీరోయిన్స్ ని తీసుకోవడం కూడా గగనం గానే మారింది. అయితే ఇలాంటి పరిస్థితులని అధిగమించి కొందరు తెలుగు అమ్మాయిలు తమ సత్తా చాటుతున్నారు. ఇలా ఇపుడు తెలుగులో మంచి డిమాండ్ పెంచుకుంటున్న హీరోయిన్స్ లిస్ట్ లో అనన్య నాగళ్ళ కూడా చేరింది.
వకీల్ సాబ్ లో చేసాక మంచి గుర్తింపు అందుకున్న ఈ తెలుగమ్మాయి అక్కడ నుంచి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయడం స్టార్ట్ చేసింది. టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడింది కానీ ఎట్టకేలకి తాను అనుకున్నది సాధించే దిశగా ఇపుడు వెళుతుంది అని చెప్పవచ్చు. మెయిన్ గా 5 కోట్ల మేర బడ్జెట్ ఉన్న మిడ్ రేంజ్ నిర్మాతల అందరి సినిమాలకి కూడా అనన్య మొదటి ఛాయిస్ గా నిలవడం విశేషం.
ఇలా ఇటీవల తంత్ర, పొట్టేల్ సహా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లాంటి సినిమాలు చేసి సత్తా చాటింది. ఇక ఇవి పక్కన పెడితే ఇపుడు తాను టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళుతుందట. అది కూడా లీడ్ పాత్రలో అనన్య ఎంపిక అయినట్టు తెలుస్తుంది. దీనితో తనకి ఇపుడు డిమాండ్ ఏ రీతిలో పెరుగుతుంది అనేది అర్ధం చేసుకోవచ్చు. మరి అనన్య మరిన్ని సినిమాలు చేస్తూ తెలుగు హీరోయిన్ గా మరిన్ని ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఆశిద్దాం.