ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘డిమోంటి కాలని 2’

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘డిమోంటి కాలని 2’

Published on Sep 16, 2024 8:08 PM IST

హార్రర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘డిమోంటి కాలని 2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని 2015లో వచ్చిన ‘డిమోంటి కాలని’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ సీక్వెల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యింది. సెప్టెంబర్ 27 నుంచి ఈ సినిమా జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుందని మేకర్స్ తాజాగా వెల్లడించారు.

అరుల్ నిథి, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మీనాక్షి గోవిందరాజన్, అర్చన చందోక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సామ్ సిఎస్ సంగీతం అందించిన ‘డిమోంటి కాలని 2’ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు