హార్రర్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ‘డిమోంటి కాలనీ’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను భయపెడుతూ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు తెలుగులోనూ సూపర్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాతో ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘‘డిమోంటి కాలనీ-2’’ని రెడీ చేశాడు ఈ డైరెక్టర్.
ఈ సినిమాను అనౌన్స్ చేయగానే అభిమానుల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమా తమిళ్లో తాజాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. అయితే, తెలుగు ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తుండటంతో, మేకర్స్ ఈ సినిమాను తెలుగునాట రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 23న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వారు అఫీషియల్‌గా ప్రకటించారు.
డిమోంటి కాలనీ-2 చిత్రాన్ని తెలుగులో ఆగస్టు 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆరోజు తెలుగు సినిమాలు పెద్దగా ఏమీ లేకపోవడంతో, ఈ సినిమాకు కలిసొచ్చే అంశం అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో అరుల్‌నిథి, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.