ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన దేశముదురు చిత్రం రీ రిలీజ్ అయ్యింది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయగా, ఇందుకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మంచి వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు 1.54 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.
ఈ చిత్రం రీ రిలీజ్ అయిన చిత్రాల్లో టాప్ 5 లో నిలిచింది. హన్సిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కి దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతం అందించారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.