‘దేసీ రాజు’ను పరిచయం చేస్తున్న ‘ఘాటీ’

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాలో అనుష్క పాత్ర ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా ఈ సినిమా నుంచి ‘దేసీ రాజు’ అనే పాత్రను సంక్రాంతి కానుకగా రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ పాత్రలో ఓ ప్రముఖ యాక్టర్ నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు ఏర్పడటంతో ఇప్పుడు ఈ ‘దేసీ రాజు’ పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు నాగవెల్లి విద్యా సాగర్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Exit mobile version