స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమాలో దేసీ రాజు అనే పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఘాటి వరల్డ్‌లో రెబల్‌గా దేసీ రాజు ప్రయాణం ఉండబోతుందని.. ఇది ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఈ గ్లింప్స్ ద్వారా ప్రేక్షకుల తెలిపారు. ఈ సినిమాలో దేసీ రాజు పాత్రలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు నటిస్తున్నాడు. ఇది ఆయనకు తెలుగులో తొలి స్ట్రెయిట్ మూవీ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో అనుష్కకు సాయం చేసే పాత్రలో దేసీ రాజు కనిపించబోతున్నాడని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.
ఈ సినిమాలో అనుష్క పాత్ర కూడా చాలా మాస్‌గా ఉండబోతుందని ఇప్పటికే ఈ మూవీ టీజర్ చూస్తే తెలుస్తోంది. మరి ఈ సినిమాలో దేసీ రాజు పాత్ర ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ సినిమాకు నాగవెల్లి విద్యా సాగర్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి