విడుదల తేదీ : జూలై 21, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, అభిలాష్ బండారి, శృతి మోల్, అనూష నూతుల, హాసిని రాయ్, మదీ, మరియు ఇతరులు
దర్శకుడు : వెంకట్ నరేంద్ర
నిర్మాత: అశోక్ రెడ్డి
సంగీతం: మార్కస్ ఎమ్
సినిమాటోగ్రఫీ: సిద్దం నరేష్
ఎడిటర్: కార్తిక్ కట్స్
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ చిన్న చిత్రంగా వచ్చిన స్పై డ్రామా “డిటెక్టివ్ కార్తీక్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక ఈ సినిమా కథలోకి వస్తే..ఓ స్కూల్ స్టూడెంట్ రిషిత(అనూష నూతుల) అనే అమ్మాయిని ఎవరో మర్డర్ చేస్తారు. అయితే ఆ చేసింది ఎవరు అనేది సస్పెన్స్ గా మారగా ఈ మిస్టరీని ఛేదించేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ అయ్యినటువంటి సంధ్య(శృతి మోల్) అనే అమ్మాయి వస్తుంది. అయితే ఈ క్రమంలో ఈమె కనిపించకుండా పోతుంది. దీనితో సంధ్యని లవ్ చేస్తున్న కార్తీక్(రజత్ రాఘవ్) రంగంలోకి దిగుతాడు. మరి తన లవర్ ని కిడ్నాప్ చేసింది ఎవరు? అలాగే ఆ మర్డరర్ ఎవరు? వేరే మనుషులా లేక ఇద్దరు ఒకటేనా అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో మొదటగా ఇంప్రెస్ చేసే అంశం ఈ సినిమా స్టోరీ లైన్ అని చెప్పాలి. మేకర్స్ మంచి కథతో అయితే ఆడియెన్స్ అటెన్షన్ ని పట్టుకునే ప్రయత్నం చేసారు. సినిమాలో థీమ్ ప్రస్తుత జెనరేషన్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉండగా అందులో పలు సన్నివేశాలు ఆసక్తిగా అనిపిస్తాయి.
ఇక సినిమా హీరో రజత్ రాఘవ రీసెంట్ గా చేసిన మరో డిఫరెంట్ చిత్రం మాయా పేటిక తర్వాత ఇది వచ్చింది. దీనితో తన స్క్రిప్ట్ సెలక్షన్ బాగుంది అని చెప్పవచ్చు. అంతే కాకుండా ఈ చిత్రంలో సాలిడ్ పెర్ఫామెన్స్ ని కూడా తాను కనబరిచాడు. అయితే ఇదే కోవలో తాను సాగితే రానున్న రోజుల్లో తనకి మంచి బ్రేక్ రావచ్చు. ఇక తనతో పాటుగా సినిమాలో కనిపించిన కొందరు నటులు మంచి రోల్స్ లో మంచి నటన కనబరిచారు. ఇంకా ఈ సినిమాలో పలు సన్నివేశాలకు మంచి మ్యూజిక్ వర్క్ కూడా ఇంప్రెస్ చేస్తుంది.
మైనస్ పాయింట్స్ :
జెనరల్ గా స్పై థ్రిల్లర్ చిత్రాల్లో ఎంతమంచి స్క్రీన్ ప్లే ఉంటే సినిమా అంత ఇంట్రెస్ట్ గా సాగుతుంది. మంచి కథ ఉన్నప్పటికీ మంచి కథనం కూడా అలాగే ఎంతో అవసరం ఇందులో కథ మంచిది ఉంది కానీ స్క్రీన్ ప్లే అయితే సరైంది లేదు. స్లో గా సాగే కథనం సినిమాపై ఆడియెన్స్ లో ఆసక్తిని తగ్గించక మానదు.
అలాగే సినిమాలో బాగా డిజప్పాయింట్ చేసే మరో అంశం ఆ క్లైమాక్స్. సినిమా క్లైమాక్స్ ని చాలా అంటే చాలా సింపుల్ గా ముగించేశారు. ఇచ్చిన ఎండింగ్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించినట్టుగా ట్రై చేసిన గోల్డి నిస్సి రోల్ కూడా ఏమంత ఎఫెక్టీవ్ గా అనిపించదు ఆమె నటన తనపై వచ్చే సీక్వెన్స్ లు సినిమాలో చికాకు తెప్పిస్తాయి.
ఇంకా మరో మెయిన్ ఫ్లా సినిమాలో సరైన క్యాస్టింగ్ లేదు మంచి ముఖ్య పాత్రలకి బెటర్ నటీనటుల్ని ఎంపిక చేయాల్సింది. కనీసం విలన్ విషయంలో అయినా కూడా కొంచెం తెలిసిన వారిని తీసుకొని మంచి అవుట్ పుట్ రాబట్టాల్సింది. అలాగే చాలా సన్నివేశాలు ఇంకా బెటర్ గా చేసే స్కోప్ ఉంది కానీ దర్శకుడు దానిని వినియోగించలేదు.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. బడ్జెట్ ఉన్నంత మేరలో మేకర్స్ మంచి సెటప్ తో డీసెంట్ అట్మాస్పియర్ ని క్రియేట్ చేయగలిగారు. ఇక టెక్నీకల్ టీం లో సంగీతం బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా అడిషినల్ ప్లస్ అని చెప్పాలి. ఇంకా ఎడిటింగ్ మరికాస్త బెటర్ చేయాల్సింది. సెకండాఫ్ లో కొన్ని అనవసర సీన్స్ తగ్గించాల్సింది.
ఇక దర్శకుడు వెంకట్ నరేంద్ర విషయానికి వస్తే తాను డెఫినెట్ గా చాలా మంచి సబ్జెక్టుని పట్టుకున్నాడు అలాగే కొంతమేర దానిని డైరెక్ట్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యాడు. అయితే కొన్ని ఫ్లాస్ మాత్రం తన డైరెక్షన్ లో లేకపోలేవు. ఇంకా మంచి స్క్రీన్ ప్లే రాసుకొని బెటర్ నరేషన్ గాని ఇచ్చి ఉంటే అండర్ రేటెడ్ టాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఇది ఒకటిగా నిలిచి ఉండేది. ఇక నెక్స్ట్ నుంచి తాను ఇలాంటివి కరెక్ట్ చేసుకంటే మంచి స్కోప్ ఉంటుంది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “డిటెక్టివ్ కార్తీక్” లో ఇంట్రెస్టింగ్ కథాంశం కనిపిస్తుంది. అలాగే హీరో రజత్ రాఘవ్ పెర్ఫామెన్స్ కూడా బాగుంటుంది. అయితే సినిమాలో ముఖ్యమైన నరేషన్ అయితే మిస్ అయ్యింది. దీనితో ఈ చిత్రం పూర్తి స్థాయిలో థ్రిల్లర్ గా ఆకట్టుకోలేదు. వీటితో అయితే ఈ చిత్రం కొంతమేర మాత్రమే ఆకట్టుకుంటుంది.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team