హీరోగా ‘మ‌గ‌ధీర’ విల‌న్.. టీజ‌ర్ లాంచ్ చేయ‌నున్న రాజ‌మౌళి!

హీరోగా ‘మ‌గ‌ధీర’ విల‌న్.. టీజ‌ర్ లాంచ్ చేయ‌నున్న రాజ‌మౌళి!

Published on Jun 18, 2024 8:01 PM IST

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ‘మ‌గ‌ధీర’ మూవీ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాతో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఈ సినిమా అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో విల‌న్ గా న‌టించిన దేవ్ గిల్ త‌న ప‌ర్ఫార్మెన్స్ తో ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

ఆ త‌రువాత చాలా సినిమాల్లో న‌టించిన దేవ్ గిల్, ప్ర‌స్తుతం హీరోగా మారాడు. ‘అహో విక్ర‌మార్క’ అనే సినిమాలో ఓ ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో దేవ్ గిల్ న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. కాగా, ఈ సినిమా టీజ‌ర్ ను స్టార్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్.రాజ‌మౌళి చేతుల మీదుగా రిలీజ్ చేయించేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు.

జూన్ 20న రాజ‌మౌళి ఈ చిత్ర టీజ‌ర్ ను లాంచ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ సినిమాను దేవ్ గిల్ స్వ‌యంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. పేట త్రికోటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమాలో షాయాజి షిండే, తేజ‌స్విని పండిత్, చిత్ర శుక్లా, ప్ర‌భాక‌ర్, బిత్తిరి స‌త్తి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు