‘దేవకీ నందన వాసుదేవ’ : ఆకట్టుకుంటున్న ‘ఏమయ్యిందే’ సాంగ్ ప్రోమో

యువ నటుడు గల్లా అశోక్ ఇటీవల తొలి సినిమా హీరో ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి పేరు అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా గుణా 369 మూవీ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవకీ నందన వాసుదేవ. కాగా దీనికి హను మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథని అందించగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.

ఇక నేడు అశోక్ గల్లా బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుండి ఏమయ్యిందే అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ప్రోమోని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మేకర్స్. సురేష్ గంగుల రాసిన ఈ సాంగ్ ని ఈశ్వర్ దత్తు పాడారు. ఇక ఈ మెలోడియస్ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిలోరియో చక్కని ట్యూన్ అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఫుల్ సాంగ్ ని త్వరలో రిలీజ్ చేయనున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై సామినేని బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్నారు.

Exit mobile version