Devara: తెలుగు స్టేట్స్ లో “దేవర” 11 రోజుల వసూళ్ల డీటెయిల్స్..

Devara: తెలుగు స్టేట్స్ లో “దేవర” 11 రోజుల వసూళ్ల డీటెయిల్స్..

Published on Oct 8, 2024 3:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి మిక్స్డ్ టాక్ తో కూడా ర్యాంప్ వసూళ్ళని ఈ చిత్రం అందుకోగా ఒక్క మన తెలుగు రాష్ట్రాల నుంచే 100 కోట్లకి పైగా షేర్ ని రాబట్టి దుమ్ము లేపింది. ఇలా మొత్తం 11 రోజుల రన్ ని దేవర తెలుగు రాష్ట్రాల్లో పూర్తి చేసుకోగా ఇప్పుడు ఏరియాల వారీగా ఈ వసూళ్ల లెక్కలు చూసినట్టు అయితే.. పి ఆర్ నంబర్స్ ప్రకారం ఇలా ఉన్నాయి..

డే 11

నైజాం – 0.73 కోట్లు
సీడెడ్ – 0.52
వైజాగ్ – 0.28
తూర్పు గోదావరి – 0.16
వెస్ట్ గోదావరి – 0.13
కృష్ణ – 0.14
గుంటూరు – 0.18
నెల్లూరు – 0.13

ఇలా 11వ రోజు మొత్తం – 2.27 కోట్ల షేర్ (జిఎస్టి కాకుండా) ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది.

ఇక మొత్తం 11 రోజుల వసూళ్లు చూస్తే

నైజాం – 47.54 కోట్లు
సీడెడ్ – 26.33 కోట్లు
వైజాగ్ – 12.98 కోట్లు
తూర్పు గోదావరి – 8.01 కోట్లు
వెస్ట్ గోదావరి- 6.25 కోట్లు
కృష్ణ- 7.34 కోట్లు
గుంటూరు – 10.34 కోట్లు
నెల్లూరు – 10.34 కోట్లు

మొత్తం 123.93 షేర్ ని జీఎస్టీ కాకుండా దేవర తెలుగు రాష్ట్రాల్లో కొల్లగొట్టింది. ఈ వారం దసరా సినిమాలు రిలీజ్ అయ్యే వారు దేవర హవా నడవనుండగా దసరా హాలిడేస్ లో కూడా దేవర సత్తా చాటే ఛాన్స్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు