మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘దేవర’ మూడో వారంలోకి అడుగుపెట్టాడు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. దసరా బరిలో పలు సినిమాలు వచ్చినా, దేవర మాత్రం స్టెడీ కలెక్షన్స్‌తో ముందుకు వెళ్తున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా మేకర్స్ తెలిపారు. కాగా, ఈ సినిమా 18వ రోజు కూడా చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.137.67 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది.
ఏరియాల వారీగా ఈ చిత్ర 18వ రోజు షేర్ వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాం – 0.40 కోట్లు
సీడెడ్ – 0.31 కోట్లు
వైజాగ్ – 0.22 కోట్లు
ఈస్ట్ – 0.07 కోట్లు
వెస్ట్ – 0.04 కోట్లు
కృష్ణా – 0.06 కోట్లు
గుంటూరు – 0.06 కోట్లు
నెల్లూరు – 0.03 కోట్లు
18వ రోజు మొత్తం వసూళ్లు – రూ. 1.19 కోట్లు
18 రోజుల వసూళ్ల వివరాలు..
నైజాం – 51.68 కోట్లు
సీడెడ్ – 30.11 కోట్లు
వైజాగ్ – 14.88 కోట్లు
ఈస్ట్ – 8.90 కోట్లు
వెస్ట్ – 6.97 కోట్లు
కృష్ణా – 8.03 కోట్లు
గుంటూరు – 11.36 కోట్లు
నెల్లూరు – 5.74 కోట్లు
టోటల్ 18 రోజుల షేర్ వసూళ్లు – రూ. 137.67 కోట్లు