Devara: నైజాంలో “దేవర” ఫస్ట్ వీక్ వసూళ్లు ఎంతంటే..


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ చిత్రమే “దేవర”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వచ్చారు. మరి ఫైనల్ గా ఏడాదిలో విడుదలకి వచ్చిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించి వరల్డ్ వైడ్ అదరగొట్టింది.

మరి ఇలా తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవర భారీ వసూళ్లు అందుకోగా ఇప్పుడు నైజాంలో మొదటి వారం వసూళ్లు రివీల్ అయ్యాయి. మరి పి ఆర్ నంబర్స్ ప్రకారం దేవర ఏడవ రోజు 1.02 కోట్ల షేర్ ని రాబట్టింది. దీనితో ఈ చిత్రం మొత్తం వారం రోజుల్లో 42.48 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసి అదరగొట్టింది. మరి నైజాంలో దేవర లాంగ్ రన్ ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version