తెలుగు స్టేట్స్ లో “దేవర” మొదటి వారం టోటల్ వసూళ్లు.!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “దేవర” భారీ అంచనాలు నడుమ విడుదల అయ్యి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సోలో హిట్ గా నిలిచింది. మరి దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తో వచ్చినప్పటికీ అదే టాక్ తో వరల్డ్ వైడ్ గా 400 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవర ఆల్రెడీ 100 కోట్ల షేర్ ని దాటి అదరగొట్టింది. ఇలా మొదటి వారం రన్ ని అయితే దేవర తెలుగు రాష్ట్రాల్లో పూర్తి చేసుకోగా ఈ 7 రోజుల వసూళ్లు డీటెయిల్స్ తెలుస్తున్నాయి. మరి పిఆ నంబర్స్ ప్రకారం చూసినట్టు అయితే..

నైజాం – 1.02 కోట్లు
సీడెడ్ – 0.73
వైజాగ్ – 0.24
తూర్పు గోదావరి – 0.19
వెస్ట్ గోదావరి – 0.12
కృష్ణ – 0.11
గుంటూరు – 0.11
నెల్లూరు – 0.12

ఇలా 7వ రోజు మొత్తం – 2.64 కోట్ల షేర్ (జిఎస్టి కాకుండా) ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది.

ఇక మొత్తం 7 రోజుల వసూళ్లు చూస్తే

నైజాం – 42.48 కోట్లు
సీడెడ్- 22.99 కోట్లు
వైజాగ్ – 11.43 కోట్లు
తూర్పు గోదావరి – 7.07 కోట్లు
వెస్ట్ గోదావరి- 5.60 కోట్లు
కృష్ణ- 6.39 కోట్లు
గుంటూరు – 9.30 కోట్లు
నెల్లూరు – 4.41 కోట్లు

మొత్తం – 109.67 కోట్ల షేర్ ని “దేవర” మొదటి వారంలో అందుకుని అదరగొట్టింది. ఇక ఈ వీకెండ్ లో కూడా దేవర సాలిడ్ వసూళ్లు అందుకునే ఛాన్స్ ఉంది. మరి చూడాలి ఈసారి ఎంత వస్తాయి అనేది.

Exit mobile version