నైజాంలో “దేవర” 5 రోజుల వసూళ్లు ఎంతంటే

నైజాంలో “దేవర” 5 రోజుల వసూళ్లు ఎంతంటే

Published on Oct 2, 2024 10:12 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఒకింత మిక్స్డ్ టాక్ తో కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకొని అదరగొట్టింది. ఇలా ఎన్టీఆర్ కెరీర్ లోనే సోలోగా బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఈ సినిమా అల్రెడీ నిలవగా ప్రస్తుతం “దేవర” వర్కింగ్ డేస్ లోకి వచ్చాక కూడా సాలిడ్ వసూళ్లు రాబడుతుంది.

ఇలా ఐదవ రోజు కూడా దేవర మంచి వసూళ్లే రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇలా దేవర నైజాంలో 5వ రోజు కూడా సాలిడ్ నంబర్స్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరి దేవర డే 5 కి నైజాంలో 2.37 కోట్ల షేర్ ని రాబట్టి స్టడీ పెర్ఫామెన్స్ తో అదరగొడుతుంది. అలాగే మొత్తం ఈ 5 రోజుల్లో 37.75 కోట్ల షేర్ (జిఎస్టి కాకుండా) వసూలు చేసి నెక్స్ట్ మార్క్ గా 40 కోట్ల షేర్ దగ్గరకు వెళ్లబోతుంది. దీనితో నైజాం మార్కెట్ లో మరోసారి తారక్ తన దమ్ము చూపిస్తున్నాడు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు