Devara: యూఎస్‌లో దేవర ర్యాంపేజ్.. 75వేల టికెట్లు సేల్!

Devara: యూఎస్‌లో దేవర ర్యాంపేజ్.. 75వేల టికెట్లు సేల్!

Published on Sep 26, 2024 12:12 AM IST

మరికొద్ది గంటల్లో ‘దేవర’ మూవీ బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమైంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ ప్యూర్ యాక్షన్ డ్రామా మూవీని దర్శకుడు కొరటాల శివ హైవోల్టేజ్ కంటెంట్‌తో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా ఇండస్ట్రీలోని రికార్డులను తిరగరాయడం ఖాయమని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడ ‘దేవర’ రిలీజ్‌కి ముందే ర్యాంపేజ్ చూపిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ-సేల్స్ రూపంలో ‘దేవర’ ఏకంగా 2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాడు. ఇదిలా ఉంటే, ‘దేవర’ మూవీ ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో ఏకంగా 75వేల టికెట్లు సేల్ అయినట్లు డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.

ఇలా ఓ మాస్ సినిమా కోసం ఈరేంజ్‌లో ప్రీ-సేల్స్ జరుగుతుండటంతో ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు