‘హాయ్ నాన్న’ పై ‘దేవర’ నటి ప్రసంశలు

‘హాయ్ నాన్న’ పై ‘దేవర’ నటి ప్రసంశలు

Published on Jan 10, 2024 1:04 AM IST

టాలీవుడ్ యువ స్టార్ యాక్టర్ నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా మూవీ హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితం అయిన ఈ పాన్ ఇండియన్ మూవీ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది.

జయరాం, నాజర్, శృతి హాసన్, ప్రియదర్శి, అంగద్ బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈమూవీ పై ఇటీవల పలువురు సినీ ప్రముఖులు ప్రసంశలు కురిపించగా తాజాగా దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా హాయ్ నాన్న మూవీ చూసి పొగడ్తలు కురిపించారు.

హాయ్ నాన్న మూవీ తన మనసుని తాకిందని, దర్శకుడు శౌర్యువ్ టేకింగ్ బాగుందని, హీరోయిన్ మృణాల్ ఎంతో ఆకట్టుకున్నారని, అలానే మరొక్కసారి హీరో నాని తన అద్భుత పెర్ఫార్మన్స్ తో అలరించారని టీమ్ కి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో ఒక పోస్ట్ పెట్టారు జాన్వీ. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు