Devara: ప్రసాద్స్‌లో ‘దేవర’ ఆల్‌టైమ్ రికార్డు..!

Devara: ప్రసాద్స్‌లో ‘దేవర’ ఆల్‌టైమ్ రికార్డు..!

Published on Sep 27, 2024 12:02 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మరికొద్ది గంటల్లో వరల్డ్‌వైడ్‌గా విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే భారీ స్థాయిలో టికెట్ బుకింగ్స్ జరుగుతుండటంతో ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా పలు ప్రాంతాల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తుంది.

అయితే, హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ థియేటర్‌లో కూడా ‘దేవర’ ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా 42 షోలను ప్రసాద్స్‌లో వేస్తున్నారు. ఇలా ఓ మాస్ మూవీ ఆల్‌టైమ్ రికార్డు షోలతో దుమ్ములేపడం సంతోషంగా ఉందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ పర్ఫార్మెన్స్‌కు థియేటర్లలో సునామీ రావడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, అజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు