రికార్డులకు తెరలేపిన దేవర.. ఫాస్టెస్ట్ ఇండియన్ మూవీ!

రికార్డులకు తెరలేపిన దేవర.. ఫాస్టెస్ట్ ఇండియన్ మూవీ!

Published on Sep 6, 2024 11:22 PM IST

‘దేవర’ రికార్డుల వేట మొదలుపెట్టాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ నటించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, తారక్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఓవర్సీస్‌లోనూ దేవర రికార్డుల మోత మొదలైంది.

ఈ సినిమాను ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. దీంతో 15 వేలకు పైగా టికెట్లు అమ్ముడైన ఫాస్టెస్ట్ మూవీగా దేవర కొత్త రికార్డు క్రియేట్ చేసింది. యూఎస్‌లో రిలీజ్ అయిన ఇండియన్ సినిమాల్లో ‘దేవర’ ఈ ఫీట్ సాధించినట్లుగా మేకర్స్ తెలిపారు. ఇక ఇప్పటికే ప్రీమియర్ షోస్ కోసం 500K డాలర్లు వసూలు చేసిన దేవర మున్ముందు మరిన్ని రికార్డులపై కన్నేశాడు.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 27న గ్రాండ్ వరల్డ్‌వైడ్ రిలీజ్‌కి దేవర సిద్ధమవుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు