‘దేవర’కు  3 రోజుల్లో రూ.304 కోట్లు 


భారీ అంచనాల మధ్య వచ్చిన ‘దేవర’ సినిమా మొత్తానికి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. టాక్ ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మాత్రం భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రధానంగా ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ.304 కోట్లు వసూలు చేసినట్లు తాజాగా మేకర్స్ ఓ క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరో వారం రోజుల్లో రూ.500 కోట్ల మార్క్‌కు చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో నిజంగా ఇది చెప్పుకోదగ్గ విజయం.

కాగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఇక సినిమా విషయానికి వస్తే.. రెండు పాత్రల్లో ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించాడు. ద్విపాత్రాభినయంలో తారక్ అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలిచింది. సినిమా పై కొందరు నెగిటివ్ ప్రచారం చేసినా.. సినిమాకి మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

Exit mobile version