Devara: ఆస్ట్రేలియాలో ఆగని ‘దేవర’ ర్యాంపేజ్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలోని కంటెంట్‌కు అభిమానులు ఫిదా కావడంతో, వారు ఒకటికి రెండు సార్లు ఈ సినిమాను వీక్షిస్తున్నారు.

బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సాలిడ్ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఏమాత్రం తగ్గకుండా తన సత్తా చూపెడుతోంది. యూఎస్‌తో పాటు ఆస్ట్రేలియాలోనూ ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు ఆస్ట్రేలియాలో వస్తున్న రెస్పాన్స్‌కు అక్కడి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏకంగా 800K ఆస్ట్రేలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది.

ఇలా ఓ తెలుగు సినిమా యూఎస్‌తో పాటు ఆస్ట్రేలియా బాక్సాఫీస్ దగ్గర కూడా దుమ్ములేపుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు

Exit mobile version