Devara: ఫస్ట్ వర్కింగ్ డే దుమ్ము లేపిన “దేవర”

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ యాక్షన్ సీ డ్రామా “దేవర” కోసం తెలిసిందే. మరి ఎన్టీఆర్ నుంచి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన సినిమా అది కూడా చాలా కాలం తర్వాత సోలోగా వచ్చిన సినిమా ఇది కావడంతో హైప్ నెక్స్ట్ లెవెల్లో చేరుకుంది.

మరి అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో భారీ వసూళ్లతో దుమ్ము లేపగా అసలు టెస్ట్ అయితే నిన్న వర్కింగ్ డే సోమవారం నుంచి మొదలైంది. మరి ఏ సినిమాకి అయినా కూడా ఫస్ట్ సోమవారం ఎంతో కీలకం. ఈరోజున ఆ సినిమా చేసే పెర్ఫామెన్స్ తో ఆ సినిమా ఎలాంటి వసూళ్లు అందుకుంటుంది అనేది కూడా ఆధారపడి ఉంటుంది.

అలా దేవర మొదటి సోమవారం ఇండియాలో అదరగొట్టింది అని చెప్పాలి. నిన్న ఒక్కరోజే బుక్ మై షో లో దేవర కి 2 లక్షలకి పైగా టికెట్స్ తెగాయి. ఇది సాలిడ్ హోల్డ్ అని చెప్పవచ్చు. మరి ఈ మంగళవారం కూడా దేవరకి గంటకి యావరేజ్ గా 2 వేలకి పైగా టికెట్స్ తెగుతున్నాయి. సో వీక్ డేస్ లో కూడా దేవర దుమ్ము లేపుతున్నాడనే చెప్పొచ్చు.

Exit mobile version