Devara: నార్త్ అమెరికాలో ‘దేవర’ తుఫాను.. 3 మిలియన్ డాలర్లతో బాక్సాఫీస్ షేక్

Devara: నార్త్ అమెరికాలో ‘దేవర’ తుఫాను.. 3 మిలియన్ డాలర్లతో బాక్సాఫీస్ షేక్

Published on Sep 27, 2024 9:00 PM IST


నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘దేవర’ ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి తాండవం చేస్తాడా అని అందరూ ఆతృతగా చూస్తూ వచ్చారు.

కట్ చేస్తే.. అనుకున్నదే జరిగింది. దేవరోడి తుఫానుకి ఓవర్సీస్ బాక్సాఫీస్ షేక్ అయ్యింది. దేవర మూవీ ప్రీమియర్స్‌కు ఎలాంటి క్రేజ్ నెలకొందో మనం చూశాం. ఇక ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా 3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లుగా మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఇలా కేవలం ప్రీమియర్స్‌కే ఇంతటి భారీ స్థాయిలో కలెక్షన్స్ రావడంతో, ఇక వీకెండ్‌లో ఈ కలెక్షన్స్ ఇంకెంత పెరుగుతాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ‘దేవర’ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. కొరటాల శివ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేశాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు