Devara: నార్త్ అమెరికాలో 6 మిలియన్ క్లబ్‌లోకి ‘దేవర’ ఎంట్రీ!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ ప్యూర్ మాస్ యాక్షన్ డ్రామాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రిపీటెడ్ ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతుండటంతో కలెక్షన్ల వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే ‘దేవర’ ఓవర్సీస్‌లో ఇప్పుడు మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా 6 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి అదరగొట్టింది. తారక్ మేనియాతో ఓవర్సీస్ ఆడియెన్స్ ఊగిపోతున్నారు. ఇక ‘దేవర’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో అభిమానులు సంతోషంతో కాలర్ ఎగరేస్తున్నారు.

ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ‘దేవర’ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సెన్సేషనల్ రెస్పాన్స్‌ను అందుకునేలా చేసింది.

Exit mobile version