‘దేవర’ ర్యాంపేజ్‌తో ఓవర్సీస్‌లో కొత్త రికార్డు

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో కొత్త రికార్డులకు తెరలేపాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇంకా రిలీజ్‌కి 20 రోజుల సమయం ఉండగానే దేవర రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో దేవర ర్యాంపేజ్ మామూలుగా లేదు.

ఈ సినిమా ప్రీ-సేల్స్‌తోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. యూఎస్‌లోనే ఫాస్టెస్ట్ 20వేల టికెట్లు అమ్ముడైన ఇండియన్ సినిమాగా ఇది సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version