నార్త్ లో “దేవర” ఫైనల్ వసూళ్లు.. భారీ లాభాలు!?


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నో రోజులు నుంచి ఎదురు చూస్తూ వస్తుండగా ఎట్టకేలకి సినిమా వచ్చి ఎన్టీఆర్ కెరీర్ లోనే సోలోగా అతి పెద్ద గ్రాసర్ గా నిల్చింది. మరి ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా హిందీలో కూడా మంచి వసూళ్లే మొదటి రెండు వారాల్లో నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే తర్వాత కొంచెం స్లో అయ్యిన ఈ సినిమా ఇపుడు ఫైనల్ రన్ ని ముగించుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో దేవర హిందీలో లైఫ్ టైం వసూళ్లుగా 80 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమా అక్కడ మంచి లాభాలే అందించినట్టుగా చెప్పాలి. ఈ సినిమా హిందీ వెర్షన్ తక్కువ మొత్తంలోనే అమ్ముడుపోయింది. దానికి ఈ రేంజ్ వసూళ్లు అంటే మంచి లాభాలే అని చెప్పాలి. సో దేవర హిందీలో కూడా సేఫ్ అయ్యిపోయింది అని చెప్పొచ్చు.

Exit mobile version