Devara: నార్త్ లో కూడా “దేవర” హవా!?

Devara: నార్త్ లో కూడా “దేవర” హవా!?

Published on Sep 26, 2024 10:10 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం పాన్ ఇండియా వైడ్ గా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ భారీ ప్రమోషన్స్ ని దేశ వ్యాప్తంగా చేయగా నార్త్ లో దేవర ఎలాంటి పెర్ఫామెన్స్ ని చేస్తుంది అనేది కూడా ఆసక్తిగా మారింది.

అయితే దేవర హిందీలో కూడా మంచి రెస్పాన్స్ నే అందుకునేలా కనిపిస్తుంది. కొన్ని చోట్ల బుకింగ్స్ బాగానే ఉండగా మరికొన్ని చోట్ల సింగిల్స్ స్క్రీన్స్ లో అయితే సోల్డ్ ఔట్స్ కూడా పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇలా దేవర కి మన తెలుగు మార్కెట్ సహా హిందీ మార్కెట్ లో కూడా సాలిడ్ బుకింగ్స్ నమోదు అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే హిందీలో దేవర డే 1 ఎంత చేస్తుంది అనేది కూడా ఇపుడు ఆసక్తిగా మారింది. మరి చూడాలి దేవర ఎంత కొడుతోంది అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు