ఇంట్రెస్టింగ్.. హిందీలో పెరుగుతున్న “దేవర” వసూళ్లు


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర అదరగొడుతున్న లేటెస్ట్ తెలుగు పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం “దేవర” అనే చెప్పాలి. మరి బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ లు నటించిన ఈ చిత్రానికి హిందీ మార్కెట్ లో కూడా సాలిడ్ వెల్కమ్ దక్కింది. అయితే హిందీలో దేవర స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుంది అని చెప్పాలి.

వీకెండ్ అయ్యాక వర్కింగ్ డేస్ లోకి దిగిన దేవర మొన్న సోమవారం 4.4 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంటే నిన్న మంగళవారం మరింత ఇంప్రూవ్ అయ్యిందని చెప్పాలి. దీనితో మంగళవారం వసూళ్లుగా “దేవర” 4.8 కోట్ల నెట్ వసూళ్లు అందుకుని అదరగొట్టింది. దీనితో నార్మల్ రోజుల్లో కూడా దేవర వసూళ్లు పెంచుకుంటూ వెళుతుంది అని చెప్పొచు. ఇక నేడు గాంధీ జయంతి హాలిడే కావడంతో నేడు మరింత స్థాయిలో సాలిడ్ నంబర్స్ నమోదు అయ్యే ఛాన్స్ తప్పకుండా ఉంది. మరి నేడు ఎంతమేర దేవర వసూలు చేస్తుందో చూడాలి.

Exit mobile version