మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే “దేవర”. తన కెరీర్ 30వ సినిమాగా అది కూడా సోలోగా తన నుంచి మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు సెట్ అయ్యి రిలీజ్ కి ఈ చిత్రం వచ్చింది. అయితే ఈ సినిమాతో హిందీలో ఎన్టీఆర్ ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటాడు అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసారు.
మరి తన మొదటి ప్రయత్నం లోనే తారక్ సాలిడ్ వసూళ్లు అందుకున్నాడని చెప్పాలి. అలా మొదటి వీకెండ్ సాలిడ్ నంబర్స్ సెట్ చేసిన దేవర మొదటి సోమవారం కూడా నిలకడ చూపించినట్టుగా బాలీవుడ్ ట్రేడ్ చెబుతుంది. ఇలా వర్కింగ్ డే సోమవారం నాడు దేవర ఇంట్రెస్టింగ్ గా 4 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించిందట. ఇలా డే 4 కి 4.4 కోట్లు నెట్ వసూళ్లు టచ్ చేసి మొత్తం నాలుగు రోజుల్లో దేవర 34 కోట్ల మేర వసూళ్లు అందుకుంది. దీనితో హిందీలో మాత్రం దేవర సాలిడ్ గా నిలబడ్డాడు అని చెప్పాలి.