“దేవర” హిస్టీరియా.. ఇండియాస్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ మార్క్

“దేవర” హిస్టీరియా.. ఇండియాస్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ మార్క్

Published on Sep 10, 2024 10:02 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి దగ్గరకి వస్తుండగా అభిమానులు ఎన్నో అంచనాలు సెట్ చేసుకొని రిలీజ్ కి వస్తున్నారు. అయితే ఈ చిత్రంపై ఉన్న హైప్ ఏ లెవెల్లో ఉందో చెప్పడానికి నిదర్శనం యూఎస్ మార్కెట్ లో నమోదు అవుతున్న బుకింగ్స్ అనే చెప్పాలి.

సినిమా విడుదలకి ఇంకా 2 వారాలకి పైగా సమయం ఉన్నప్పటికీ అక్కడ ఆల్రెడీ ఈ చిత్రం ఏ ఇండియన్ సినిమా కూడా అందుకోని భారీ రికార్డు సెట్ చేసుకుంది. యూఎస్ లో దేవర లేటెస్ట్ గా 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని కేవలం ప్రీ సేల్స్ తోనే కొట్టేసింది. ఇది మామూలు సెన్సేషన్ కాదని చెప్పాలి.

ఇది రిలీజ్ నాటికి ఇది డబుల్ త్రిబుల్ అయినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరి ఈ రకంగా అయితే దేవర హిస్టీరియా కొనసాగుతుంది. ఇక ఈ భారీ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వరల్డ్ వైడ్ ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు