Devara: ఫస్ట్ వీక్ లో వరల్డ్ వైడ్ రికార్డు మైల్ స్టోన్ కొట్టేసిన “దేవర”


లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన మరో అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే “దేవర”. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకొని ఎదురు చూసిన నిరీక్షణకు ఈ చిత్రం భారీ వసూళ్లు అందుకొని ఆశ్చర్యపరుస్తుంది. అలాగే ఈ చిత్రం డే 1 నుంచే సెన్సేషనల్ నంబర్స్ ని సెట్ చేస్తుండగా ఇప్పుడు మొదటి వారం రన్ ని అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకుంది.

మరి ఈ వారం రోజుల్లో దేవర రికార్డు మైల్ స్టోన్ ని క్రాస్ చేసేసినట్టుగా మేకర్స్ ఇపుడు అఫీషియల్ నెంబర్ ని రివీల్ చేశారు. మరి 6 రోజులకి 396 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం 7 రోజుల్లో 405 కోట్ల మార్క్ ని సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో సోలోగా మొట్ట మొదటి 400 కోట్ల గ్రాస్ సినిమాగా భారీ రికార్డు సాధించింది.

దీనితో తారక్ మాస్ బ్యాటింగ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా కొరటాల శివ దర్శకత్వం వహించారు. అలాగే అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version