‘పుష్ప-2’, ‘ఓజి’లను దాటేసిన ‘దేవర’.. మామూలు క్రేజ్ కాదుగా!

‘పుష్ప-2’, ‘ఓజి’లను దాటేసిన ‘దేవర’.. మామూలు క్రేజ్ కాదుగా!

Published on Aug 21, 2024 9:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ కోసం అభిమానుల్లో ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో హైప్ పీక్స్‌కు చేరుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌లు అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే, టాలీవుడ్‌లోనే ఇప్పుడు ‘దేవర’ టాప్ ప్లేస్‌లో నిలిచిందని ఓ సర్వే తాజాగా ప్రకటించింది.

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన ఆర్మాక్స్ సినిమాటిక్స్ అనే సర్వేలో టాలీవుడ్‌లోనే ది మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘దేవర పార్ట్-1’ నిలిచినట్లు పేర్కొంది. టాలీవుడ్‌లో రాబోయే కొన్ని క్రేజీ ప్రాజెక్టులపై ఈ సర్వే నిర్వహించగా, ‘దేవర’ టాప్ ప్లేస్‌తో దుమ్ములేపిందని ఆ సంస్థ పేర్కొంది. ఇక టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ‘పుష్ప-2’, ‘ఓజి’, ‘జై హనుమాన్’, ‘స్పిరిట్’ ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి.

ఇలా పలు క్రేజీ ప్రాజెక్టుల్లో ‘దేవర’ ది మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలవడంతో, ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచుకుంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక ‘దేవర పార్ట్-1’ సెప్టెంబర్ 27న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు