ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. మరి భారీ యాక్షన్ తో కూడిన పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం రిలీజ్ కి వస్తుండగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ప్లానింగ్ లు దేవర కోసం జరుగుతున్నాయి.
అలా ఏపీ ప్రభుత్వం దేవర కోసం 27 తెల్లవారు 12 గంటలతోనే మొదటి షోస్ కి పర్మిషన్స్ ఇవ్వడమే కాకుండా టికే ధరల పెంపునకు కూడా అనుమతి ఇచ్చారు. దీనితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అలాగే ఉప ముఖ్యమంత్రి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా తారక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
తెలుగు సినిమాకి ఇంతలా సప్పోర్ట్ చేస్తూ నిలిచినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా దేవర విషయంలో తారక్ ఆనందం వ్యక్తం చేసాడు. దీనితో పవన్, తారక్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ దేవర కోసం ఎదురు చూస్తున్నారు.
My heartfelt gratitude to the Honourable CM, Sri @NCBN garu, and Honourable Deputy CM, Sri @PawanKalyan garu of the Andhra Pradesh government for passing the new G.O. for the #Devara release and for your continued support of Telugu cinema. I'm also thankful to Cinematography…
— Jr NTR (@tarak9999) September 21, 2024