Devara: యూఎస్ మార్కెట్ లో “దేవర” లేటెస్ట్ వసూళ్లు.!


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఎన్టీఆర్ కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ ని అందించారు.

మరి ఈ చిత్రం యూఎస్ మార్కెట్ లో కూడా భారీ వసూళ్లు సొంతం చేసుకుంటుండగా అక్కడ ఆల్రెడీ 5 మిలియన్ మార్క్ ని దాటేసి దుమ్ము లేపింది. ఇక లేటెస్ట్ గా అయితే సినిమా 5.25 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి నెక్స్ట్ మార్క్ గా 5.5 మిలియన్ కి దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా రాబోతుంది.

Exit mobile version