“దేవర” డోస్ పెంచాల్సిందేనా!?


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సహా మాస్ ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ కి కూడా దగ్గరకొస్తుంది. నేటి నుంచి సరిగ్గా నెల రోజులు అయితే ఉంది. మరి ఇక్కడ నుంచి దేవర డోస్ పెంచాల్సిందే అని చెప్పాలి.

సెకండ్ సాంగ్ తర్వాత మళ్ళీ మేజర్ అప్డేట్ అయితే సినిమా యూనిట్ నుంచి ఇంకా లేదు. ఇక ప్రమోషన్స్ కూడా పెంచాల్సిందే. RRR కాకుండా ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో పాన్ ఇండియా సినిమా ఇది సో ప్లానింగ్స్ అంతా భారీ లెవెల్లోనే అభిమానులు ఆశిస్తారు. మరి చూడాలి దేవర కి మేకర్స్ ఎలాంటి పాన్ ఇండియా ప్రమోహనల్ అండ్ కంటెంట్ ప్లాన్స్ చేస్తారో అనేది. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా సినిమా రిలీజ్ కాబోతుంది.

Exit mobile version