Devara: తెలుగు రాష్ట్రాల్లో “దేవర” మ్యానియా.. అనేక చోట్ల భారీ కటౌట్స్

Devara: తెలుగు రాష్ట్రాల్లో “దేవర” మ్యానియా.. అనేక చోట్ల భారీ కటౌట్స్

Published on Sep 26, 2024 3:12 PM IST

పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం “దేవర” పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయి అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఎన్నో ఏళ్ల నిరీక్షణ నుంచి ఇప్పుడు గంటల వ్యవధి దగ్గరకి వచ్చేసారు. మరి ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో రిలీజ్ అందులోని ఐదేళ్ల తర్వాత సోలో రిలీజ్ అంటే ఆ హంగామా ఎలా ఉంటుందో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు చూపిస్తున్నారు.

ఇలా దేవరకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సింగిల్ స్క్రీన్స్ దగ్గర భారీ కటౌట్స్ వెలిసాయి. దీనితో ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా మాస్ ఏరియాస్ అన్నిటిలో కూడా తారక్ పై గజమాలలు వేసి మరీ భారీ మొత్తంలో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. దీనితో ఈ విజువల్స్ అంతా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు