దేవర.. ప్రస్తుతం టాలీవుడ్లో ఎవరిని టచ్ చేసినా ఈ మాటే వినిపిస్తుంది. దేవర(Devara) ఎక్కడ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడా.. రిలీజ్‌కి ముందే ‘ఇదెక్కడి మాస్ మావా’ అంటూ చర్చలు జరుపుతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ విధ్వంసానికి ఇంకా వారం రోజులకిపైగా సమయం ఉన్నా, బాక్సాఫీస్ బానిసగా మారి సలాం కొడుతోంది.
ముఖ్యంగా ఓవర్సీస్లో దేవరోడి ఊచకోత ఏమాత్రం తగ్గకుండా ఉంది. అక్కడ సినిమా రిలీజ్‌కి ముందే ప్రీ-సేల్స్ రూపంలో దేవర రక్తపాతం సృష్టిస్తున్నాడు. సినిమా రిలీజ్‌కి ఇంకా 8 రోజుల సమయం ఉన్నప్పటికీ 50వేలకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం సాధారణ విషయం కాదు. అటు కలెక్షన్స్ రూపంలోనూ ఈ సినిమా రిలీజ్ నాటికి 2 మిలియన్ డాలర్ల మార్క్ టచ్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఇలా రిలీజ్‌కు ముందే దేవర వేట మొదలుపెట్టడం.. అతడి వేటకు బాక్సాఫీస్ సైతం బానిసగా మారడంతో నందమూరి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. ఇక రిలీజ్ తరువాత ఈ సినిమా రికార్డులను పాతర వేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.