సెన్సార్ పూర్తి చేసుకున్న “దేవర”

సెన్సార్ పూర్తి చేసుకున్న “దేవర”

Published on Sep 10, 2024 8:01 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర చిత్రం సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులని, అభిమానులని బాగా అలరించాయి. సినిమాపై మరింత అంచనాలను పెంచాయి. అయితే రిలీజ్ డేట్ కి దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ ను షురూ చేశారు.

మరొక పక్క ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికెట్ ను ఇచ్చారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సైఫ్ అలీఖాన్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అజయ్, ప్రకాష్ రాజ్, పవిత్రా లోకేష్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు