సెంచరీ పూర్తి చేసిన ‘దేవర’.. అభిమానులకు ఇది కదా కావాల్సింది!

సెంచరీ పూర్తి చేసిన ‘దేవర’.. అభిమానులకు ఇది కదా కావాల్సింది!

Published on Jan 4, 2025 5:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగించింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ అభిమానులను కట్టిపడేసింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోనూ అందుబాటులో ఉంది.

అయితే, తాజాగా ‘దేవర’ మూవీ ఓ అరుదైన ఫీట్ సాధించింది. ఈ మధ్య కాలంలో వంద రోజుల పోస్టర్ చూద్దామన్నా కనిపించడం లేదు. అలాంటింది, దేవర మూవీ సక్సెస్‌ఫుల్‌గా 100 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. 6 సెంటర్లలో ఈ మూవీ 100 డేస్ రన్ కొనసాగించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

100 రోజుల పోస్టర్ చూడాలని అభిమానులు కోరుకుంటారని.. అభిమానులకు ఇలాంటి రికార్డులు కావాలని వారు సోషల్ మీడియాలో కోరుతున్నారు. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించగా అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు