యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఫాస్టెస్ట్ 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరి రికార్డు క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లతో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ రిలీజ్ కు ముందుగా 1.5 మిలియన్ డాలర్లను అత్యంత వేగంగా రాబట్టిన చిత్రంగా దేవర చిత్రం నిలిచింది.
ఇదే విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. సెప్టెంబర్ 27, 2024 న థియేటర్లలోకి రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, సైఫ్ ఆలీఖాన్, ప్రకాష్ రాజ్, అజయ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.