“దేవర” పాన్ ఇండియా ప్లానింగ్ మామూలుగా లేదుగా.. డీటెయిల్స్ ఇవే 

“దేవర” పాన్ ఇండియా ప్లానింగ్ మామూలుగా లేదుగా.. డీటెయిల్స్ ఇవే 

Published on Sep 14, 2024 1:05 PM IST

పాన్ ఇండియా సినిమా దగ్గర ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో అవైటెడ్ టాలీవుడ్ చిత్రం “దేవర”. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా చేసిన ఈ భారీ చిత్రంని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా వరల్డ్ వైడ్ గా సాలిడ్ హైప్ ని ఈ చిత్రం సెట్ చేసుకుంది. అలాగే ఎన్టీఆర్ నుంచి మొదటి సోలో పాన్ ఇండియా రిలీజ్ సినిమా ఇది కాగా అందుకు తగ్గట్టుగానే తారక్ చురుగ్గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.
అయితే ఇలా పాన్ ఇండియా వైడ్ గా ఆడియెన్స్ కి రీచ్ అయ్యే విధంగా మేకర్స్ సాలిడ్ ప్లాన్స్ ని చేస్తున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఆల్రెడీ హిందీకి సంబంధించి బాలీవుడ్ లో గ్రాండ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తెలుగులో సంబంధించి ఈ సెప్టెంబర్ 21 లేదా 22న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట.
అలాగే చెన్నైలో ఒక ఈవెంట్, బెంగళూరులో ఓ ఈవెంట్ ఫైనల్ గా కొచ్చి లో కూడా ఈవెంట్ ని చేసి పర్ఫెక్ట్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ని మేకర్స్ డిజైన్ చేసినట్టుగా ఇపుడు తెలుస్తుంది. మరి ఈ అవైటెడ్ సినిమా ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు