నార్త్ అమెరికాలో “దేవర” దూకుడు!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర చిత్రం ఈ నెల 27 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతుంది. జనతా గ్యారేజ్ చిత్రంతో సూపర్ సక్సెస్ సాధించిన ఈ కాంబినేషన్ లో మరో చిత్రం వస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అందులోనూ, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చేస్తున్న చిత్రం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ సేల్స్ నార్త్ అమెరికాలో ఎప్పుడో ప్రారంభం అయ్యాయి.

ఈ చిత్రం నార్త్ అమెరికాలో దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకూ 700కే డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. రిలీజ్ డేట్ కి వన్ మిలియన్ కి పైగా ఈ నంబర్ ఉండే అవకాశం ఉంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version