అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేవర పార్ట్ – 1 మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రెండోసారి నటించాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ క్యారెక్టర్ చేశాడు. నిన్న రిలీజైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది.
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రం రన్ టైమ్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం 2 గంటల 57 నిమిషాల 58 సెకండ్ల నిడివి తో ఉంది. ఇది భారీ రన్ టైమ్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది.