రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణలో “దేవర”

రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణలో “దేవర”

Published on Jun 10, 2024 12:01 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర(Devara). ఈ చిత్రంకు సంబందించిన షూటింగ్ గోవా లో శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఎన్టీఆర్‌ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్ మరికొన్ని రోజులు గోవాలో జరగనుంది.

రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. ఈ చిత్రం నుండి రిలీజైన మొదటి పాట ఇప్పటికే సంచలనంగా మారింది. రెండవ పాట కూడా త్వరలో విడుదల కానుందని మరియు ఈసారి ఇది రొమాంటిక్ నంబర్‌గా ఉంటుందని వార్తలు వచ్చాయి. సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు