వరల్డ్ వైడ్ గా ఒకే టైమ్ కి స్టార్ట్ కానున్న “దేవర” షోలు!?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర సెప్టెంబర్ 27 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఒకే టైమ్ కి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇండియా టైమ్ ప్రకారం మిడ్ నైట్ 1:08 గంటలకి ఇండియాలో, యూఎస్ ప్రాంతంలో ఒకేసారి ప్రారంభం కానుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో, సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version